Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నందలూరు బస్టాండ్ ఆర్ఎస్ రోడ్డుకు వెళ్లే మార్గం దెబ్బతిని ప్రజలు ప్రయాణికులు వాహనదారులు పాదాచారులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆర్ అండ్ బి రోడ్డుకు గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణఆధ్వర్యంలో శనివారం మర మ్మతులు చేశారు.అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రోడ్డు దెబ్బ తినడంతో పాటు వర్షం వచ్చినప్పుడల్లా నేను నిలబడి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని సర్పంచ్ సూర్యనారాయణ అనేకమార్లు జిల్లాస్థాయి లో జరిగే గ్రీవెన్స్ సేల్లో సమస్య పరిష్కరించమని అలాగే ఆర్ అండ్ బి .నేషనల్ హైవే అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం కనబడలేదు. దీంతో చేసేది లేక సర్పంచ్ సూర్యనారాయణ చొరవ తీసుకొని గతంలో ఒక మారు రోడ్డుకు మరమ్మత్తులు చేయడం జరిగింది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ రోడ్డు పూర్తిగా కొట్టుకు పోవడంతో తిరిగి మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని డస్ట్ చిప్స్ ద్వారా గుంతలను పూడ్చి రోడ్డును బాగు చేయడం జరిగింది. ఇది తాత్కాలికమే అయినా ప్రజల సౌకర్యార్థం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఆర్ అండ్ బి నేషనల్ హైవే అధికారులు స్పందించి ఒకరిపై ఒకరు చెప్పుకోకుండా రోడ్డు సమస్యను పరిష్కరించాలని సర్పంచ్ కోరారు.