జనం న్యూస్ జనవరి 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
రాష్ట్రంలో అభివృద్ధి అంతా నేనే చేశానని నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి పత్రికా ప్రకటనలు చేయడం దయ్యాలు కూడా సిగ్గుపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ ఒక ప్రకటన జగన్ రెడ్డిని ఘాటుగా దుయ్యబెట్టారు. ఎర్ర బస్సు వెళ్లలేని భోగాపురానికి ఎయిర్ బస్సు ఎందుకు అని జగన్ రెడ్డి ప్రశ్నించారని, తీరా అభివృద్ధి జరిగిన తర్వాత తానే చేశానని, క్రెడిట్ చోరీ జరుగుతుందని జగన్ రెడ్డి అసంధర్భ పేలాపన చేయడం అతను మానసిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారని సత్యనారాయణ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత కించెత్తు కూడా అడుగు ముందుకు వేయలేదని, జిఎంఆర్ కు కాకినాడ సెజ్ లో 51 శాతం వాటాలను అరబిందో కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 2023లో మొదటిసారి శంకుస్థాపన చంద్రబాబు నాయుడు 2019లో చేయిగా, రెండవసారి 2023లో జగన్ రెడ్డి శంకుస్థాపన చేసి 20% పనులు మాత్రమే చేయగలిగారని, కేవలం శంకుస్థాపన ముఖ్యమంత్రిగా చేసిన శంకుస్థాపనలకే మరలా మరలా శంకుస్థాపనలు చేస్తూ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేసిన దాఖలు లేవని, ఉత్తరాంధ్రలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఋషికొండలో నిర్మాణాలను ధ్వంసం చేసి, కొండని దొలిచి, పర్యావరణానికి ఆటంకం కలిగించి, 500 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు ఉత్తరాంధ్ర ప్రజలకు బే షరతుగా క్షమాపణ చెప్పాలని, ఇప్పుడిప్పుడే పెట్టుబడుదారులు కూటమి ప్రభుత్వంపై నమ్మకం కలగడంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుంటే దీన్ని చూసి ఓర్వలేక బెదిరింపు మెయిల్స్ పంపడం, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం, రాష్ట్ర అభివృద్ధి నిరోధకుడుగా, నాశనం చేయాలని చూస్తున్నాడని, తిరుమల పవిత్రతను దెబ్బతీసి, లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేశారని, ఆఖరికి కాళీ మద్యం సీసాలు పెట్టి చేస్తున్న నీచుపు పనులను కూడా దేవుడి క్షమించడని ఇటువంటి జగన్ రెడ్డి రాష్ట్రానికి అవసరమా అని సత్యనారాయణ ప్రశ్నించారు.


