Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 6 కాట్రేనికొన : కాట్రేనికోన గ్రామంలోని దేవి సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈనెల 16 తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత హోమియో వైద్య సేవా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి అనుపమ రెస్టారెంట్ అధినేత యల్లమిల్లి త్రినాధ్ తెలిపారు. ప్రతినెల మూడవ ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. రాజమండ్రికి చెందినడాక్టర్ శ్యామ్ హోమియోకేర్ హాస్పిటల్స్ సౌజన్యంతో ప్రముఖ హోమియో ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ శ్యాం కుమార్ వైష్ణవ్ ఎండి వారిచే ఉచితంగా అన్ని వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వైద్య సేవలు పొందాలని త్రినాధ్ కోరారు. వైద్య శిబిరానికి వచ్చేవారు వ్యాధికి సంబంధించి పాత రిపోర్టులు, మందుల చీటీలతో సంప్రదించాలని ఆయన కోరారు.