జనం న్యూస్, జనవరి 10,కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్
వీణవంక మండలం కోర్కల్ గ్రామానికి చెందిన కర్ర తిరుపతి రెడ్డి మాతృమూర్తి శనివారం ఉదయం మరణించగా, వారి భౌతికకాయానికి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్టసమయంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


