జనం న్యూస్ జనవరి 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎస్ సి మోర్చా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గొటివాడ సామ్రాట్ కుమార్ అధ్యక్షతన నూతన ఎస్ సి మోర్చా నూతన పదాధికారుల నియామక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకి ముఖ్య అతిధిగా భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వర రావు పాల్గొని ఆయన చేతుల మీదుగా మునగపాక మండలం తిమ్మరాజు పేటకి చెందిన బాదం ప్రవీణ్ కుమార్ బీజేపీ ఎస్ సి మోర్చా కోశాధికారి గా బాధ్యత స్వీకరించారు. ఈ సందర్బంగా బాదం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు నా వంతు పార్టీకి ఎనలేని సేవలు అందిస్తానని జిల్లా పార్టీ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.//


