Listen to this article

✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు✍️కాటూరి మెడికల్ కాలేజీ& ఆసుపత్రి డాక్టర్లు వృద్ధుని ప్రాణాలు కాపాడి కొత్త జీవితానికి ప్రసాదించారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల చెందినటువంటి తిరుపతిరావు (75) ఈనెల 17వ తేదీన కాళ్లు చేతులు పడిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. గుంటూరు, మంగళగిరి లాంటి ప్రాంతాల్లో పలు ప్రవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో చివరి ఫలితంగా కాటూరి మెడికల్& ఆసుపత్రి డాక్టర్లు తిరుపతిరావు ప్రాణాలు కాపాడారన్నారని తెలిపారు. ఎంఆర్ఐ స్కాన్ చేయగా మెదడులో రక్తం గడ్డ కట్టి, మెదడు మీద తీవ్ర ప్రభావం ఏర్పడడంతోపాటు శ్వాస తీసుకునే విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా గమనించిన డాక్టర్లు వెండి లెటర్ సహాయంతో కృత్రిమ విశ్వాసనిఅందించి, సుమారు పది రోజులపాటు మృత్యువాతతో పోరాడి బతికారన్నారు.ఈ వైద్యమంతా అధికఖర్చులతో కూడినప్పటికీ కాటూరి ఆసుపత్రికి చెందిన వైద్యులు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా చేశారని రోగి కుటుంబీకులు తెలిపారు. ఈ మేరకు ఆరోగ్యవంతంగా కోలుకుంటున్నా చలపతిరావు, వారి బంధువులు కాటూరి జనరల్ మెడిసిన్, వైద్య విభాగ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు డాక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు వరప్రసాద్, రవీంద్రారెడ్డి, రామకృష్ణ, సిహెచ్ మోహన్ రావు తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.