జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు వాకర్స్ క్లబ్ సభ్యులు ఇవాళ బిజెపి రాజంపేట పార్లమెంట్ ఇంచార్జ్ సాయి లోకేష్ కుమార్ ని కలిసి ప్రస్తుత పుల్లంపేట నుండి రేణిగుంట వరకు రహదారి పనులు జరుగుతున్నట్లుగా..రాజంపేట నుండి కడప వరకు ఉన్న రహదారి తీవ్రంగా ప్రయాణానికి ఇబ్బంది కరంగా గుంతలతో నిండి ఉన్నందున ప్రజా అవసరాల దృష్ట్యా ప్రస్తుతం ఉన్న రహదారిపై అదనపు లేయర్లను వేయుటకు ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించ వలసినదిగా కోరుతూ ఈ మార్గంలో నిత్యం రద్దీతో కూడుకున్న శ్రీ సౌమ్యనాథ స్వామి ఆ లయం మరియు ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం ఉన్నాయని, అలాగే నిత్యం వ్యాపార సముదాయాలతో ఉంటున్న మాధవరం చేనేత పరిశ్రమలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన HPCL ఫ్యూయల్ ట్యాంకులతో భాకరాపేట వద్ద ఉన్నాయని వీటి దృష్ట్యా ప్రయాణికులు మరియు వ్యాపారవర్గాల ప్రయోజనాల కొరకు రహదారి మరమ్మత్తులు తక్షణం చేయించవలసిన అవసరం ఉన్నదని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.అలాగే నందలూరు మండల ప్రజానీకానికి ఎప్పటినుండో హైదరాబాద్ అవసరాల దృష్ట్యా వెంకటాద్రి రైలుతో అనుబంధం ఉండేదని, ఈ రైలు నందలూరు లో స్టాపింగ్ ఏర్పాటు చేయించినచో మండల ప్రజల అవసరాల కొరకు ఉపయోగపడుతుందని కావున రైల్వే శాఖ వారి దృష్టికి తీసుకుని వెళ్లి వెంకటాద్రి ఎక్సప్రెస్ నందలూరులో నిలుపుదల చేయించగలరని సాయి లోకేష్ ని కోరడం జరిగింది. తదుపరి నందలూరు వాకర్ క్లబ్ సభ్యుల వినతులను వారు సావధానంగా తెలుసుకొని సానుకూలంగా స్పందించి తదుపరి చర్యల కొరకు తన వంతు ప్రయత్నం తప్పక చేయగలనని హామీ ఇవ్వడం తో ఈ సందర్భంగా సాయి లోకేష్ గారికి వాకర్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలపటం జరిగింది.ఈ కార్యక్రమంలో మన్నెం. రామ మోహన్, కుర్రా. మణి యాదవ్, ఉప్పుశెట్టి.సుధీర్, మోడపోతుల రాము, గంధం గంగాధర్, దాసరి. వెంకటరమణ ( మండల బిజెపియువనాయకుడు )గండికోట కృష్ణ కుమార్, గురు ప్రసాద్, పాటూరు రమేష్, సుధాకర్ ( విస్డం స్కూల్), గుండు సురేష్, యంబలూరి ప్రదీప్, తీగలకుంట వెంకటేష్, రాఘవ, బద్రి రమేష్, కార్తీక్ తదితరులు పాల్గొనడం జరిగింది.



