Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 6 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : 2.o చూస్తారు. 3 0 ఏళ్ల అధికారమని సినిమాకబుర్లు చెప్తున్నాడు : మాజీమంత్రి ప్రత్తిపాటిటూరిస్ట్ లా అప్పుడప్పుడు రాష్ట్రానికి వస్తూ, అవినీతి..దోపిడీ. ఆలోచనలు చేసే జగన్ కు కూటమి ప్రభుత్వ పాలనా నిర్ణయాలు, ప్రజా విజయాలు ఏం కనిపిస్తాయి?తాను ప్రజలకోసం పనిచేశానని జగన్ చెప్పడం 8వ వింత అయితే, ఇకపై కార్యకర్తలే ముఖ్యమని చెప్పడం పచ్చిబూటకం : పుల్లారావు.ఒక్క అవకాశమని రాష్ట్రప్రజల్ని నమ్మించి, శుష్క వాగ్దానాలతో అధికారం చేపట్టి, ఆనక నమ్మి ఓట్లేసిన జనాన్ని, రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేసిన జగన్ రెడ్డి పగటి కలలు కంటున్నాడు. తనకు ప్రతిపక్షహోదా ఇవ్వలేదని పవిత్రమైన అసెంబ్లీలో అడుగుపెట్టని వ్యక్తి మరో 30ఏళ్లు అధికారం వెలగబెడతానని ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రిగా తాను ప్రజలసంతోషం కోసం పనిచేశానని జగన్ చెప్పడం 8వ వింత. కార్యకర్తలను భవిష్యత్ లో ఉద్ధరిస్తాననడం పచ్చిబూటకం. అధికారంలో ఉన్నప్పుడు పరదాలు.. పోలీస్ వలయాల మధ్య డాబు, దర్పంతో ముఖ్యమంత్రి పదవి అంటే వారసత్వంగా వచ్చిన రాచరికమన్నట్టు విర్రవీగిన వ్యక్తి, ఇప్పుడు నిస్సిగ్గుగా కూటమిప్రభుత్వంపై తన అక్కసు వెళ్లగక్కుతున్నాడు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు, సొంతపార్టీ వారి ముందు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. మునిగిపోతున్న పార్టీని, తనని వదిలించుకుంటున్న నాయకుల్ని ఏమార్చడానికే జగన్ 2.o లు.. 30ఏళ్ల అధికారమని సినిమాకబుర్లు అని ప్రత్తిపాటి అన్నారు.జగన్ అంటున్న 2.O తో రాష్టం కనుమరుగు అవుతుందేమో : పుల్లారావుకట్టుకథలు, గారడీ మాటలతో ప్రజల్ని వంచించి, ఎడాపెడా పన్నులభారం మోపి, ధరల పెంపుతో వారినివీరబాదుడు బాదింది జగన్ రెడ్డి కాదా? పాలన ముసుగులో దుర్మార్గాలు, దోపిడీతో ప్రజల్ని నరకకూపంలోకి, రాష్ట్రాన్ని వెంటిలేటర్ పైకి చేర్చింది కాక, తగుదునమ్మా అంటూ ఇప్పుడు తాను పథకాలతో ప్రజల్ని మెప్పించానని బుకాయిస్తున్నాడు. జగన్ గత ఐదేళ్లు అమలుచేసిన 1.o తోనే జనం శంకగిరి మాన్యాలు పట్టేదుస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఆయన చెబుతున్న 2.o తో అసలు రాష్ట్రమే ప్రపంచపటం నుంచి కనుమరుగు అవుతుందేమో. ఒక్క ఛాన్స్ అని బతిమాలితే నమ్మి ప్రజలు అవకాశమిచ్చారు. అదే తన మొదటి, చివరి ఛాన్స్ అని జగన్ తెలుసుకుంటే మంచిది. ప్రజలపక్షాన చట్టసభల్లో గొంతెత్తడానికి భయం.. ప్రజల్లోకి వెళ్లి తన ప్రభుత్వం చేసిన మేలు ఇదని చెప్పుకోలేని అగత్యం. వెరసి జగన్ కు అంతిమంగా మిగిలేది ప్రజల చేతిలో ఊహించని ఘోరపరాభవాలు.. సొంతపార్టీ వారి దెప్పిపొడుపుళ్లే. కూటమిప్రభుత్వ 8 నెలల పాలనా నిర్ణయాలు అమలైన హామీలు, ప్రజావిజయాలు ఏవీ జగన్ రెడ్డికి కనిపించవు. ఎందుకంటే టూరిస్ట్ మాదిరి ఎప్పుడో ఒకసారి రాష్ట్రానికి వస్తాడు కాబట్టి. అధికారముంటేనే ఆయనకు రాష్ట్రం, ప్రజలు గుర్తుకొస్తారు. ప్రజల, ప్రభుత్వ భూముల కాజేయడానికి జగన్ అండ్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను తొలిసంతకంతో ఎవరు రద్దు చేశారో జగన్ కి తెలియదు.. హామీకి కట్టుబడి సామాజిక పింఛన్లను రూ.4వేలు, రూ.6వేలు, రూ.10వేలకు పెంచింది చంద్రబాబనే వాస్తవాన్ని జగన్ జీర్ణించుకోలేడు. ఉచిత గ్యాస్ పథకంతో మహిళల ముఖాల్లో కొత్తవెలుగులు నింపింది చంద్రబాబనే నిజాన్ని ఆయన అంగీకరించడు. ప్రజల చేతికే ప్రభుత్వ సేవలు అందించే మనమిత్ర వాట్సాప్ సేవలు జగన్ కు అర్థంకావు. ఉచిత ఇసుకవిధానం, పారదర్శకమద్యం విధానం, పోలవరం, అమరావతికి కేంద్రమిచ్చిన నిధులు. రైల్వే బడ్జెట్లో ప్రాధాన్యతలు, గ్రౌండ్ రియాలిటీ లు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ల అమలుచేస్తూ తీసుకున్న తాజా నిర్ణయం జగన్ కు అనవసర విషయాలు. ఎందుకంటే ఆయన ఆలోచనలన్నీ అవినీతి..దోపిడీ.. అక్రమార్జన.. హత్యారాజకీయాల చుట్టూనే తిరుగుతుంటాయి కాబట్టి. కూటమిప్రభుత్వం అమలుచేసిన హామీలు.. 8నెలల పాలనా ప్రగతిపై ప్రజలమధ్య మాట్లాడే ధైర్యం జగన్ కు లేదు. మునిగిపోతున్న తన పార్టీని, తనని వదిలించుకుంటున్న నాయకులను కాపాడుకోవడానికే జగన్ 2.o లు.. 30 ఏళ్లు.. ముందు ముందు చూస్తారు అని ముచ్చట్లు చెబుతున్నాడు.” అని ప్రత్తిపాటి ఎద్దేవా చేశారు.