Listen to this article

స్వామి వివేకానంద ప్రపంచ మతసమ్మేళన ప్రసంగం

జనం న్యూస్,జనవరి 12,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని పీఎం దామరగిద్ద గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశానికీ,హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1893 సెప్టెంబరు 11న చికాగోలో మొదటి ప్రపంచ మత సమ్మేళనంలో చేసిన ప్రసంగం సుప్రసిద్ధమైందని అన్నారు.స్వామీ వివేకానంద 1893 ప్రపంచ మత సమ్మేళనానికి భారత దేశానికీ,హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించారు.11 నుంచి 1893 సెప్టెంబరు 27లో నిర్వహించిన ఆ సమ్మేళనం మొదటి ప్రపంచ మత సమ్మేళనం. ప్రపంచవ్యాప్తంగా పలు మతాల ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారని అన్నారు. వివేకానంద చేసిన ఈ చరిత్రాత్మక ప్రసంగంలో ప్రియమైన అమెరికా సోదర, సోదరీమణులారా (మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా) అని సంబోధిస్తూ ప్రారంభించడంతోనే శ్రోతలను ఆకట్టుకున్నారని అన్నారు.సాధారణంగా లేడీస్ అండ్ జంటిల్మన్ అన్న సంబోధనకు అలవాటు పడ్డ వారిని, ఈ పిలుపులోని ఆత్మీయత ఆకర్షించింది. ఆయన సందేశానికి, వాక్పటిమకూ, నిజాయితీతో కూడిన సంభాషణకు అక్కడి ప్రతినిధులు ఆకర్షితులయ్యారు. అమెరికన్ పత్రికలు సైతం వివేకానందుని వ్యక్తిత్వం,సందేశాన్ని ప్రశంసించాయి అని అన్నారు.1893 సెప్టెంబరు 11న పర్మినెంట్ మెమోరియల్ ఆర్ట్ ప్యాలెస్ (ప్రస్తుతం ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షికాగో) లో వరల్డ్ కొలంబియన్ ఎక్స్‌పొజిషన్‌లో భాగంగా ప్రపంచ మత సమ్మేళనం జరిగింది. అదే రోజున వివేకానందుడు తన తొలి ప్రసంగం చేశాడు. ఎంతో ఆలస్యం తరువాత మధ్యాహ్న సమయంలో అతనికి అవకాశం వచ్చింది. మొదట కాస్త కంగారు, అధైర్యం కలిగితే సరస్వతీ దేవికి నమస్కరించాడు.ఆ తర్వాత తన శరీరంలోకి కొత్త శక్తి వచ్చిన అనుభూతి కలిగింది; మరెవరో తన శరీరాన్ని ఆక్రమించినట్టు అయింది – “భారతదేశపు ఆత్మ, ఋషుల ప్రతిధ్వని, రామకృష్ణుని స్వరం, పునరుజ్జీవనం చెందిన కాలపు ఆత్మ మాటలకు వాహికగా”ప్రసంగిస్తున్న అనుభూతితో తన ప్రసంగం ప్రారంభించాడు. “అమెరికా సోదర సోదరీమణులారా!” అంటూ ప్రారంభించడంతోనే ఏడువందల మంది జనం లేచి రెండు నిమిషాల పాటు కరతాళధ్వనులతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. కరతాళధ్వనులు నిశ్శబ్దంలోకి మణిగిపోయాకా మళ్ళీ తన ప్రసంగాన్ని ఆరంభించాడు. చారిత్రకంగా చాలా ఇటీవలదైన ఆ దేశానికి “ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఋషులైన వైదిక ఋషి పరంపరకు చెందిన సన్యాసుల తరఫున, ప్రపంచానికి సామరస్యాన్ని, విశ్వంలోని ప్రతీదాన్నీ ఆమోదించగల తత్వాన్ని నేర్పిన మతం తరఫున” శుభాభినందనలు తెలియజేస్తూ ప్రారంభించాడు.2012లో మూడు రోజుల ప్రపంచ సమ్మేళనాన్ని చికాగోలో కౌన్సిల్ ఫర్ ఎ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్‌తో కలిసి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ రిలీజియన్స్ (వాషింగ్టన్ కాళీ ఆలయానికి చెందినది) నిర్వహించింది.ఈ కార్యక్రమం వివేకానందుని 150వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటుచేశారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువజన సంఘ నాయకులు, పార్టీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.