Listen to this article

జుక్కల్ జనవరి 12 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం నాగుల్గావ్ రైతువేదిక లో వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ యాసంగి పంటల యాజమాన్యం పైన అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా శెనగ పంటలో ఎండుతెగులు నివారణకు, పచ్చ పురుగు నివారణకు సూచనలు ఇవ్వడం జరిగింది. మొక్కజొన్న పంటలో ఎరువుల యాజమాన్యం పైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. కత్తెర పురుగు నివారణకు వేపనూనె 1500 పి పి ఎం 500 ఎం ఎల్ ఎకరాకు దానితో పాటు ఏమమెక్టిన్ బెంజోయేట్ ( EM1) 100గ్రాములు కలిపి మొక్క సుడిలో పడేలా పిచికారి చేయాలని సూచించడం జరిగింది. జొన్న పంటలో కాండం తొలుచు పురుగు నివారణకు వేపనూనె1500 పి పి ఎం 500 ఎం ఎల్ ఎకరాకు దానితో పాటు క్లోరిపైరిఫోస్50 ఈసీ 500 ఎం ఎల్ కలిపి పిచికారి చేయాలని సూచించడం జరిగింది.జాతీయ ఆహార భద్రత మరియు పోషణ మిషన్ (NFSNM 2026)కింద సబ్సిడీ మీద రైతు సోదరులకు వేప నూనె మరియు 13.0.45 అందచేయడం జరిగింది.
అనంతరం నూతనంగా ఎన్నికయిన గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద విజయ్ పాటిల్ ని, ఉప సర్పంచ్ కోల్నురే అమృత్ గోండా గారిని, వార్డు సభ్యులు సంతోష్ ని వ్యవసాయ శాఖ జుక్కల్ మండలం తరుపున సన్మానించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈరోజు రైతువేదిక లో నిర్వహించిన సమావేశానికి రైతు సోదరులు రగోబ శ్రీనివాస్, శివరామ్ ప్రకాష్ , జుక్లె దేవీదాస్ , అబ్బాస్వర్ లక్ష్మణ్,జాదవ్ దామోదర్, ముత్యల్వర్ వీరేశం, సాయిరాం, శివరామ్ అశోక్ పటేల్,భగవత్ కుమార్,గోపాల్ రావు,హరి విటోభ పటేల్,రాజు, బలరాం తదితరులు పాల్గొన్నారు.