Listen to this article

జనం న్యూస్ జనవరి 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం జిల్లా పశుగాణభివృద్ధి సంస్థ పశుసంవర్ధశాఖ ఆధ్వర్యంలో మండలంలోని మైలారం గ్రామంలో ఉచిత గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరాన్ని గ్రామ సర్పంచ్ నూనె. దివ్య తిరుపతి ప్రారంభించారు. ఈ శిబిరంలో పాల్గొన్న మండల పశు వైద్య అధికారి డాక్టర్ సునీల్ మాట్లాడుతూ రైతులు గోపాలమిత్రుల సేవలు వినియోగం కోవాలని పశువులు యాద కు వచ్చినపుడు కృత్రిమ గర్భధారణ చేయించాలని పశుగ్రాసలు సాగు చేసుకోవాలని సూచించారు, దూడలకు నట్టల నివారణ మందులను త్రాగించుకోవాలని, గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరంలను వినియోగించుకోవాలని సూచించారు.ఈ శిబిరాలలో 48పాడి పశువులకు గర్భధరణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణి చేశారు ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర సూపెర్వైసోర్ ప్రకాష్ రెడ్డి, గోపాలమిత్రులు సుదర్శన్, రంజిత్, సతీష్ ప్రజ్వల్ ప్రతినిధులు అమరేందర్ రెడ్డిలు రైతులు తదితరులు పాల్గొన్నారు….