Listen to this article

జనం న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

మాజీ మంత్రివర్యులు, కార్మిక ఉద్యమ నేత, పేదల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహానేత దివంగత పి. జనార్ధన్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని మూసాపేట్ ఆంజనేయ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మూసాపేట్ డివిజన్ మాజీ అధ్యక్షుడు చున్నూ పాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, పి. జనార్ధన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, కార్మిక వర్గం హక్కుల కోసం, పేదల సంక్షేమం కోసం పి. జనార్ధన్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. రాజకీయాల్లో విలువలు, నిజాయితీ, ప్రజాసేవకు ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పిశెట్టి రాఘవేంద్ర, తూము వేణు, ఎల్లేష్ యాదవ్, తూము సంతోష్, సప్పిడి భాస్కర్ రావు, తూము సచిన్ తదితరులు పాల్గొని పి. జనార్ధన్ రెడ్డి సేవలను స్మరించుకున్నారు.కార్యక్రమం అంతా గౌరవప్రదంగా, భావోద్వేగ వాతావరణంలో కొనసాగింది. పి. జనార్ధన్ రెడ్డి ఆదర్శాలు రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.