Listen to this article

జనం న్యూస్ జనవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

అయినవిల్లి మండలం కె. జగన్నాధపురం గ్రామంలో స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు గని శెట్టి వెంకటేశ్వరరావు ( బాబీ మాస్టారు) ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163 వ జయంతి ఉత్సవాలు జరిగాయి ఆయన మాట్లాడుతూ యువతి యువకులు వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని అన్నారు స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు మరియు విద్యానిధి ప్రిన్సిపల్ సుధీర్ గారు నాగ మాధవి దంపతుల సహకారంతో తదనంతరం గ్రామంలో పక్షవాతం తో బాధపడుతున్న కటికి దళ బాలయ్య కుటుంబానికి భర్తను కోల్పోయిన కొప్పిశెట్టి దుర్గా కుటుంబానికి హిందూ ధర్మానికి కృషి చేస్తున్న తాడినాటి వెంకటేశ్వరరావు కుటుంబానికి ఒక నెలకు సరిపడే నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో సమాజ సేవకులు సూరపరెడ్డి సురేష్ మల్లాది సూర్య మల్లికార్జునరావు నల్ల సత్తిబాబు యనమదల వెంకటరమణ మోర్తా సత్తిబాబు మిద్దె నూతన రవిరాజు గోలకోటి కృష్ణారావు నల్ల మణికంఠ యెర్రంసెట్టి కృష్ణ శ్రీకాకుళపు రాధాకృష్ణ మొగలి దుర్గారావు నల్ల శ్రీరామ్ నల్ల చరణ్ భీమవరపు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు