జనం న్యూస్ జనవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి
1863వ సంవత్సరం – జనవరి నెల – 12వ తేదీన జన్మించి వివేకానందునిగా మారిన నరేంద్రనాథ్ దత్తా జన్మదినాన్నే మన సువిశాల భారతం జాతీయ యువజన దినోత్సవం గా వివేకానంద యూత్ అధ్యక్షులు పాలూరి జయ ప్రకాష్ నారాయణ (జేపీ) ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా శిల్పి రాజ్ కుమార్ వడయర్, రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యనందం పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం rss ఖండ ప్రముఖ్ తోగరు ఆంజనేయులు మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత విశేషాలు వివరించారు. ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది – కాబట్టి నీవు నిరంతరం బలవంతుడిగా మారడానికి ప్రయత్నిస్తూనే ఉండు.కానీ,శారీరక బలం కంటే – ఆర్థిక బలం గొప్పది,ఆర్థిక బలం కంటే – సామాజిక బలం గొప్పది,సామాజిక బలం కంటే – మానసిక బలం గొప్పది – మానసిక బలం కంటే – జ్ఞాన బలం గొప్పది అని మాత్రం మర్చిపోకు. ఈ కార్యక్రమం లో మండల బిజెపి అధ్యక్షులు సంపతి కనకేశ్వరరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లు మద్దం శెట్టి శ్రీనివాసరావు, పాలాటి మాధవ స్వామి,కముజు శివ, కోటిపల్లి దామోదర్, అన్యం సత్యనారాయణ,ఉద్దరాజు ప్రసాద్ రాజు, బొర్రా ఆంజనేయులు,సిద్దంశెట్టి గంగారావు సిద్దంశెట్టి శంకర్ సింగిరెడ్డి వీరన్న రేలంగి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


