జనం న్యూస్ జనవరి 12 మమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ముమ్మిడివరం మండలం ఠాణేలంక బాడవ గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ధార్మిక సమితి సభ్యులు లక్ష్మణరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గొలకోటి వెంకటరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించినారు ముందుగా భరతమాత పూజ స్వామి వివేకానంద జయంతి నిర్వహించి వివేకానందుని యొక్క మార్గంలో యువత పయనించాలని సూచించారు చిన్న పిల్లలకు ముందుగా భోగి పళ్ళు పోసి ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం జరిగినది సంక్రాంతి అంటే పిండి వంటలు అటువంటి పిండి వంటలను సాంప్రదాయబద్ధంగా రోటిలో బియ్యము దంచి పిండి తయారు చేసి కట్టెల పొయ్యిపై పిండి వంటలు చేయడం జరిగినది పాలు పొంగించి పొంగలి తయారుచేసి అందరికీ పంచడం జరిగినది. భోగిమంట వెలిగించి బోగి పిడకలు వేసి చిన్నారుల సందడి చేయడం జరిగింది. ఎస్ఎస్ఎఫ్ ధర్మ ప్రచారక్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన మరిచిపోతున్న మన ఆచారాలు సాంప్రదాయాలు చిన్నారులకు తెలుస్తాయి అన్నారు మనందరం మన ధర్మాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రంధి నానాజీ సుంకర నాగేశ్వరరావు మొల్లేటి లక్ష్మణరావు బొక్కా నాగేశ్వరి రాయుడు రాజేశ్వరి దంగేటి నాగమణి రాయుడు చంద్రావతి మొల్లేటి కనకదుర్గ దంగేటి ఈశ్వరి కొనే రామ్మూర్తి గాలిదేవర రమేష్ మొల్లేటి తులసి దంగేటి అర్జువేని దంగేటి స్వర్ణలత గ్రామస్తులు మాతృమూర్తులు పాల్గొన్నారు



