

జనం న్యూస్ ఫిబ్రవరి 7 జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీరు పూర్ మండల పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి ఈనెల 19 వరకు జరిగే జాతర బ్రహ్మోత్సవాలకు అదిలాబాద్ జిల్లా నిజామాబాదు . కరీంనగర్ ఉమ్మడి జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు ప్రతి ఏటా దర్శించుకుంటారు. జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఆలయ అధికారులు భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం స్వామివారి ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈనెల 9 శ్రీ స్వామి వారి కళ్యాణోత్సవం ఈనెల 17 నా స్వామి వారి రథోత్సవం.18 నా ఏకాంత ఉత్సవం 19 నా తిరుమంజనం తో స్వామి వారి ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈవో సంకుటాల శ్రీనివాస్ ఆలయ అర్చకులు వోద్దిపర్తి సంతోష్ చార్యులు వోద్దిపర్తి చిన్న సంతోష్ చార్యులు వోద్దిపర్తి మధుకూమార్ చార్యులు తెలిపారు