జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
గీతాంజలి ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫైనల్స్ విజేతకు కప్ అందచేసిన జనసేన నేత అతికారి కృష్ణ..ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గీతాంజలి అధినేత సంభావు వెంకటరమణ కుమారుడు వినయ్ ఆధ్వర్యం లో రాజంపేట మండలం ఊటుకూరు గ్రామ పంచాయతీ వెంకటరాజం పేట లో సంక్రాంతి వేడుకలలో భాగంగా గత 30 రోజులుగా దాదాపు 40 టీములు పైగా క్రికెట్ పోటీలలో పాల్గొన్నాయి. ఈ రోజు ఫైనల్ పోటీలు టీ.కమ్మపల్లి బలిజపల్లి టీమ్ వారికి వెంకట రాజంపేట టీం మధ్య రసవత్తరంగా జరిగి చివరికి అంతిమ విజేతలుగా టీ. కమ్మపల్లి బలిజపల్లి గ్రామ పంచాయతీ నిలిచింది.ఈ నెల రోజులుగా ఈ పోటీలు చాలా క్రమశిక్షణగా పద్ధతి గా జరిగాయి.ఈ పోటీల విన్నర్ లకు 50000 రూపాయల న గ తు పాటు పెద్ద క్రికెట్ కప్ జనసేన పార్లమెంట్ సమన్వయ కర్త అతికారి కృష్ణ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లీగల్ సెల్ అధ్యక్షుడు తరిగోపుల లక్ష్మీనారాయణ..గీతాంజలి అధినేత తెలుగుదేశం నాయకుడు సంభావు వెంకటరమణ యువనేత కంభయి లక్ష్మీ నరసింహ మరియు కూటమి నేతలు అనేక మందిపాల్గొని అంద చేశారు.క్రికెట్ రన్నర్స్ జట్టుకు 30000 రూపాయల నగదు రన్నర్స్ ట్రోఫీ అండ చేసారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ఎంతో మంది ఉత్తమ క్రీడాకారులను తయారు చేసి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అంద చేయాలనే లక్ష్యం తో ప్రతి సంవత్సరం యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఈ పోటీలను శ్రమ నుకోకుండా నిర్వ హిస్తున్నాన ని,అన్నారు.ఇవే కాకుండా బెస్ట్ బౌలర్.బెస్ట్ బ్యాట్స్ మన్.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్..సిరీస్,కూడా అంద చేశారు.ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ క్రికెట్ టీమ్ లో పాల్గొని జిల్లా కు రాష్ట్రానికి సెలెక్ట్ కావడానికి ఏ విధంగా కాస్త పడాలో అందులో ఉండే మెలుకువలు గురించి తెలియ చేశారు.భవిష్యత్తులో క్రీడాకారులకు తన వంతు సహాయం అందిస్తా అన్నారు.లక్ష్మీ నారాయణ నరసింహ లు మాట్లాడుతూ గీతాంజలి రమణ ఈ మ్యాచ్ నిర్వహణకు కోసం ఎంత శ్రమ పడుతున్నది చక్కగా వివరించారు..లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఏదైనా సహాయం కావాలన్న అంద చేస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కూడా అయిన లక్ష్మీనారాయణ కోశాధికారి నరసింహ అన్నారు..ఇంకా ఈ కార్యక్రమం లో జనసేన కడప నేత రమణ అగ్రహారం చల్లా సుధాకర్ అబ్బిగారి గోపాల్ .తోట రామయ్య.వెంకటస్వామి. ఉద్దండంసుధాకర్. శివ..ప్రభాకర్. సీను.తేజ పాండు .చంద్ర తదితరులు పాల్గొని విజయవంతం చేసారు.



