జనం న్యూస్ జనవరి 12 2026( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )
మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేసిన సంఘటన మండలములోని ఓ గ్రామములో చోటుచేసుకుంది. XXX గ్రామానికి చెందిన ఓ వికలాంగురాలు ఇంటి వద్దనే ఉంటుంది. తల్లిదండ్రులు వ్యవసాయ పని నిమిత్తం పొలం వద్దకు వెళ్లినది గమనించి, ఆమెకు దూరపు బంధువు అయిన పోలె పాక ప్రభాకర్ (55 సంవత్సరాలు) r/o. పెగడపల్లి (v), hasanparthi (m)ఆమెపై అత్యాచారం చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఆమె పరిస్థితిని గమనించి పలుమార్లు అడుగగా, తనను బెదిరించి చంపుతానని అత్యాచారం చేసినట్లు తెలుపగా, పిర్యాదురాలి తల్లి ఇచిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైనది. ఈ రోజు Elkaturthy గ్రామంలో నిందితున్నీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించనైనది.


