జనం న్యూస్ జనవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికొన ఈ రోజుల్లో 50 సంవత్సరాలు వచ్చేసరికి అనేక ఆసుపత్రులు చుట్టేస్తున్నారు. అల్లోపతి, హోమియోపతి, వంటి మందులను రుచి చూస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామానికి చెందిన పాకలపాటి సీతాదేవి జనవరి 12 నాటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని వందో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు,ఇద్దరు కుమారులు స్వగ్రామంలోనే ఉంటూ నేటికీ తన పని తాను చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటం గమనార్హం. సోమవారం ఆమె కుటుంబ సభ్యులు మరియు బంధువులు 100వ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఆరోగ్య సూత్రాలు పాటించడమే తన ఆరోగ్య రహస్యమని ఆమె వెల్లడించారు.



