Listen to this article

వేల గొంతుల లక్ష డప్పుల సభకు మద్దతు తగ్గేదేలే

మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య

జనం న్యూస్ 6 ఫిబ్రవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి : భీమారం మండల కేంద్రంలో గురువారం రోజున కలగూర రాజకుమార్ మాట్లాడుతూ ఈనెల 7వ తేదీన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన వేల గొంతులు లక్ష డప్పుల సభకు తాము పూర్తిగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా దశలవారీగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ చేయాలని వారు కోరారు సమాజంలో అణగారిన వర్గాలైన దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం మాదిగల తో పాటు మాదిగ ఉపకులాలకు సమాన వాటా కల్పించాలని ఎమ్మార్పీఎస్ దీక్ష ఫలితంగానే గతంలో ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ వికలాంగులకు వితంతు వృద్ధాప్య పెన్షన్ తో పాటు నిరుపేద పిల్లలకు గుండె జబ్బు ఉన్న వారికి ఉచిత ఆపరేషన్ల కార్యక్రమాన్ని విజయవంతంగా సాధించారని పాలకవర్గాలు రాజ్యాంగం ప్రకారం దళితుల తో పాటు దళితుల ఉపకులాలకు రావలసిన సమాన వాటాను ఇవ్వడంలో వివక్షత చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్లను పాలకవర్గాలు తప్పకుండా అమలు చేసి న్యాయం చేయాలని ఈనెల 7వ తేదీన హైదరాబాద్లో జరిగే సభకు వాయిదా పడ్డ కూడా గ్రామాల మండలాల వారిగా డప్పు కొనడం ఆగదని మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య , ఇంటింటికి దప్పును అందించే బాధ్యత తీసుకుంటానాని భరోసా కల్పించాడు