జనం న్యూస్ 13 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఎస్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన గంజాయి కేసులో ఒడిశాకు చెందిన బిస్మా చరణ్ సుగ్రీకి 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమాన విధిస్తూ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. అరకు నుంచి కారులో తరలిస్తున్న 50 కిలోల గంజాయి వాహన తనిఖీల్లో పట్టుబడిందన్నారు. జరిమాన చెల్లించకపోతే అదనంగా మరో సంవత్సరం జైలు శిక్ష పడుతుందన్నారు.


