జనం న్యూస్ జనవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి సీనియర్ పత్రికలు బాబాయ్ విజయ్ కళ మిగిలింది..! కాలం ముగిసింది..! ఇదే కదా జీవితం..! అన్న చందాగా బండారుపల్లి విజయ్ కుమార్ ప్రస్థానం ఇలా ముగిసింది. ఇటీవల కాలంలో కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి తనువు చాలించాడు. వివిధ పత్రికలలో పనిచేసి నలుగురితో ఎంతో ఆప్యాయతగా మెలుగుతూ పలువురు ప్రశంసలు అందుకుని తన జీవితం సాఫీగా సాగిపోతున్న వేళ మధుమేహం రూపేనా తనను కబలించింది. తోటి స్నేహితులు మరియు విలేకరులు ఎంతో శ్రమించినప్పటికీ పలువురికి దూరమైపోయాడు. తను తల్లి సైతం అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా తమ ఒక్కగాని ఒక చెల్లి. వద్ద విజయవాడలోఉంటూ కాలం వెలుతీస్తుంది. తన మరణ వార్త విన్న ఆ చెల్లె హృదయం తన అన్న భౌతిక దేహం పై పడి ఎక్కిన ఏడుస్తూ పలువురు సూపర్లను కంటతడి పెట్టించింది జీవితమంటే ఏదీ శాశ్వతము కాదు అన్ని అశాశ్వతమే అని కుమార్ భౌతికకాయాన్ని చూసి ఎంతో నేర్చుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని పలువురు తెలుసుకోవాలి అన్న నానుడు అక్కడ వినిపించింది. అలానే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్ష కార్యదర్శులు కుమార్ కి శ్రద్ధాంజలి ఘటించారు.//


