Listen to this article

జనం న్యూస్ జనవరి 13 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి

కూకట్‌పల్లి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ఆదేశాల మేరకు రామకృష్ణ వీధిలో పాడైపోయిన ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువులను ఉచితంగా సేకరించేందుకు మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా డీసీఎం వ్యాన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం కాలనీవాసుల్లో మంచి స్పందనను రాబట్టింది.రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీలోని ఇళ్లలో ఉపయోగానికి పనికిరాని టీవీలు, ఫ్రిజ్‌లు, పాత ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ విధమైన కార్యక్రమాలు ఎంతో అవసరమని కాలనీవాసులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది కుమార్, రమేష్, రవీందర్ నాయక్, స్వాతి, వెంకటమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొని పాత వస్తువుల సేకరణను సజావుగా నిర్వహించారు. అలాగే కాలనీవాసులు శ్రీధర్ రావు, సూర్యనారాయణ, సునీత, సునీల్ పటేల్, కిషోర్ తదితరులు తమ ఇంట్లో ఉన్న పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను మున్సిపల్ డీసీఎంకు అందజేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు మాట్లాడుతూ కాలనీలో ఎవరి ఇంట్లోనైనా పాడైపోయిన ఎలక్ట్రానిక్ లేదా ఎలక్ట్రికల్ వస్తువులు ఉంటే మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కాలనీలో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో వాటిని పరిష్కరించేందుకు తాము ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు.ఈ తరహా కార్యక్రమాలు పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని, భవిష్యత్తులోనూ ఇలాంటి సేవలు కొనసాగించాలని కాలనీవాసులు మున్సిపల్ అధికారులను కోరారు.