జనం న్యూస్ జనవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
జీవీఎంసీ నిధుల నుండి 13 లక్షలతో కోట్ని వీధిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ వద్ద రోడ్డు డ్రైనే లేక ప్రజలతోపాటు ఆసుపత్రికి వచ్చే రోగులకు కూడా ఇబ్బంది గా ఉన్న విషయం కార్పొరేటర్ చిన్నతల్లి దృష్టికి సమస్యను తీసుకురావడంతో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మేజర్ పీలా శ్రీనివాసరావు టిడిపి అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ సిఫార్సులతో మంజూరు చేసిన నిధులతో పనులు చేపట్టామని 84వ వార్డు ఇంచార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.//


