

జనంన్యూస్. 06.నిజామాబాదు. ప్రతినిధి : శ్రీనివాస్.నిజామాబాదు..గోసంగీ కుల రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల సాయి చరణ్ మాట్లాడుతూ. ఎస్సీ. వర్గీకరణ ని స్వాగతిస్తున్నాం కానీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విధానం ద్వారా మమ్మల్ని మరింత వెనుకకు నెట్టి వేసి, మాకుతీవ్ర అన్యాయాన్ని, ఆవేదనను మిగిల్చింది.మాల మాదిగ కుల లా తరువాత అత్యంత అధిక జనాభా కలిగిన గోసంగీ కులాన్ని కేవలం 23.351 జనాభాగా చూయించడం చాలా బాధాకరంప్రభుత్వం 2011 లెక్కలు పరిగణన లోకి తీసుకున్నప్పుడు 2024 లో కులగణన ఎందుకు చేశారు..బీసీ లకు కొత్తలెక్కలు, ఎస్సీ. లకు పాత లెక్కలు ఎందుకు?జస్టీస్ షమీమ్ అక్తర్ కమీషన్ కు అన్ని ఉపాకులాలలు మాల, మాదిగాలతో సంభందం లేకుండా ప్రత్యేక విభాగం లో ఉంచమని కోరాము..కానీ కమీషన్ అందుకు భిన్నంగా వ్యవహారించింది ఎవరి ప్రయోజనం కోసం..?ఉపాకులాలు మాల మాదిగల్తో సమానంగా పోటీ పడగలరా…. అటువంటప్పుడు వారితో ఎందుకు చేర్చారు..?మా జానాభా ఆధారంగా మా వాటా ఇవ్వకుండా ఎందుకు మా గొంతు నొక్కారు..?2024 లెక్కలు ఎందుకు బహిర్గతం చేయలేదు..?సుప్రీం కోర్టు నిబంధనలకు అనుగుణంగా కమీషన్ నడుచుకుంటే… ఉద్యోగ, రాజకీయ రంగాలలో మా స్థిగతులను, వెనుక బాటు తనాన్ని ఎందుకు పరిగణన లోకి తీసుకోలేదు…?
ఎస్సీ ఉపకులలకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని2024 జనాభా లెక్కల ప్రకారం మా గోసంగీ కులానికి న్యాయం చేయాలని ప్రభుత్వం కోరుతున్నాం మాల మాదిగ లతో పోటీ పడే స్థితి కి ఇంకా ఉపకులలు ఎదగలేవని ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నాంఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బెక్కం బాలయ్య కోశాధికారి ధర్మపురి .సభ్యులు గంగన్న రమేష్ బాలక్రిష్ణ నరేందర్ మహేష్ రాజు తదితరులు పాల్గొన్నారు