Listen to this article

జనంన్యూస్. 13.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి ఐఏఎస్ ని అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్‌పాల్ సూర్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌తో చర్చించారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు.జిల్లా అభివృద్ధి కోసం జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ దిశగా తన పూర్తి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.