జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 13రిపోర్టర్ సలికినీడి నాగు
భవిష్యత్ లో ప్రజలు మినీ చిలకలూరిపేటను చూస్తారు.
2026లో ప్రజలు చంద్రబాబు నాయకత్వ సుస్థిరాభివృద్ధి ఫలాల్ని అందుకుంటారు.
టిడ్కో సముదాయంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మాజీమంత్రి ప్రత్తిపాటి.
పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసి, కార్యక్రమ నిర్వాహకుల్ని, మహిళల్ని పేరుపేరునా అభినందించిన ఎమ్మెల్యే.చిలకలూరిపేట సమీపంలోని టిడ్కో గృహ సముదాయాన్ని మరో పట్టణంగా తీర్చిదిద్దుతామని, భవిష్యత్ లో నియోజకవర్గ ప్రజలు మరో మినీ చిలకలూరిపేటను చూస్తారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.స్థానిక టిడ్కో గృహ సముదాయంలో నిర్వహించిన ప్రభుత్వ సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక అతిథిగా ప్రత్తిపాటి హాజరయ్యారు.. ఈ సందర్భంగా భోగి మంటలు వేసి సంబరాలు ప్రారంభించారు. హరిదాసుల కీర్తనలు ఎంతో ఆకట్టుకున్నాయి. చిన్నారులకు భోగి పండ్లు వేసిన ప్రత్తిపాటి అనంతరం సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించిన షటిల్, లెమన్ స్పూన్, రన్నింగ్, ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం పండగ ఏర్పాట్లు చేసిన నిర్వాహకుల్ని అభినందించి, సభను ఉద్దేశించి మాట్లాడారు గత ఐదేళ్లూ ప్రజలకు సంతోషాలు సంబరాలు లేవు అన్నీ కక్షసాధింపులు.. బెదిరింపులు దోపిడీలే 2014-19లో టీడీపీ ప్రభుత్వంలో 52 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన టిడ్కో గృహ సముదాయం సకల హంగులతో అందుబాటులోకి వచ్చిందని, కూటమిప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపినందునే ఇది సాధ్యమైందని ప్రత్తిపాటి చెప్పారు. గత ఐదేళ్లలో ప్రజలు సంక్రాంతి.. ఇతర సంబరాలు, సంతోషాలకు దూరమయ్యారని, కక్షసాధింపులు..బెదిరింపులు..దోపిడీలతో నిత్యం బిక్కుబిక్కుమంటూ నరకయాతన అనుభవించారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. 2025 సంవత్సరం రాష్ట్ర నాయకత్వ ప్రతిభను, సామర్థ్యాన్ని ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసిందని, రాష్ట్రాన్ని పెట్టుబడుల ప్రవాహంలో ముంచెత్తిందని ప్రత్తిపాటి తెలిపారు. 2026లో ప్రజలు చంద్రబాబు పాలనా సంస్కరణల్లో సరికొత్త వేగాన్ని చూస్తారని, సుస్థిర ఆర్ధికాభివృద్ధితో ప్రభుత్వ సేవలు, పథకాలలో మెరుగైన పనితీరుతో ప్రజలకు మరిన్ని విస్తృత ప్రయోజనాలు అందుతాయని ప్రత్తిపాటి ఆశాభావం వ్యక్తంచేశారు. అదేవిధంగా 2027లో ప్రజారాజధాని అమరావతి నిర్మాణ ఫలాలు..పోలవరం జలాలు ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుకలుగా అందుతాయన్నారు.మహిళలు తప్పకుండా ‘సరస్’ ను సందర్శించాలి
స్వయం సహాయక సంఘాల మహిళలతో పాటు.. సాధారణ మహిళలు కూడా కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గుంటూరులో ఏర్పాటు చేసిన జాతీయస్థాయి ప్రదర్శన సరస్ (సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్) ను వీక్షించాలని, వివిధ రాష్ట్రాలకు చెందిన మీలాంటి మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు, వస్తు ప్రదర్శనల్ని తప్పకుండా చూడాలని, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా తిలకించాలని ప్రత్తిపాటి సూచించారు. కేంద్రమంత్రి పెమ్మసాని కృషితో దిల్లీలో ఏర్పాటుకావాల్సిన జాతీయస్థాయి ప్రదర్శన మన గుంటూరుకు వచ్చిందన్నారు. దేశంలోని స్వయం సహాయక సంఘాల మహిళల సొంత ఉత్పత్తుల్ని చూడటానికి రెండు కళ్లూ సరిపోవన్నారు.కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ ఉపాధ్యక్షులు మురకొండ మల్లిబాబు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, తెలుగు మహిళా నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


