Listen to this article

జనం న్యూస్. ఫిబ్రవరి 6. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)బిసి కమిషనర్ కు సంచార జాతులు వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకుండా పోయిందని. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా కమిషనర్ వ్యవహరిస్తున్నారని. ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి రాజేశ్వర్ ఆరోపించారు.కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గత ఎన్నికల సమయంలో కుల గణన ఏర్పాటు చేస్తానని చెప్పి. బీసీలకు సంచార జాతులకు త్రీవ అన్యాయం చేశారని ఆరోపించారు. గురువారం నాడు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎస్సీ. ఎస్టీలకు. మాత్రమే న్యాయం చేసిందని ఆయన అన్నారు. సంచార జాతులు ఎన్నో సంవత్సరాల నుండి పల్లెలు తిరుగుతూ జీవనోపాధి కొనసాగిస్తున్నారని. అటువంటి వారికి త్రీవ అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల ప్రకారం ఇప్పటివరకు సంచార జాతులకు రిజర్వేషన్లు కేటాయించకపోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల జనాభాను తగ్గించి. తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం బీసీలకు రిజర్వేషన్ పెంచుతామని చెప్పి మోసం చేయడం ఎంతవరకు న్యాయమని ఆయన అన్నారు.బిసిల జనాభా తగ్గించి వేరే కులాల జనాభా ఎలా పెరిగిందని ఆయన సూటిగా ప్రశ్నించారు.ఏ కులం ఎంత జనాభా ఉందో చూపించి. జనాభా రిజర్వేషన్ ప్రకారం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం వారి స్వార్థ ప్రయోజనాల కోసం బీసీలను సంచార జాతులను వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని బీసీలకు సంచారజాతులకు ఆయన సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.