జనం న్యూస్ జనవరి 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
హిందువుల అతిపెద్ద పండగ బోగీ సంక్రాంతి కనుమ పండుగకు మొదటిగా గుర్తు వచ్చేది హరిదాసే.హిందూ దేవాలయాలు సాంప్రదాయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఆడారి . కుమారస్వామి.. హరిదాస్ కు ఘణ సత్కారం. ధనుర్మాసం చివరి రోజులు అయినటువంటి ఈరోజు విజయరామరాజుపేట విజయ వినాయక దేవాలయం వద్ద ఘణంగా హరిదాసు కు సన్మానం జరిగినది విజయరామరాజుపేట పెద్దలు ఈ ప్రాంత ప్రజలు గ్రామ కమిటీ సభ్యులు అందరూ సంయుక్తంగా హరిదాసుని (హరిదాసు.అప్పారావు)ఘనంగా పూలమాలతో సాలువాళ్ళతో సత్కరించిరి. అనంతరం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆడారి కుమారస్వామి గ్రామ కమిటీ డైరెక్టర్, హిందూ సంప్రదాయాలు దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు మాట్లాడుతూ నగర పురవీధులలో హరినామ స్మరణతో సాక్షాత్తు విష్ణుమూర్తి నారద రూపంలో భూలోకమునకు వచ్చిన వ్యక్తిగా హరిదాసుని కొలుస్తారని పురాణాలు తెలియపరచుచున్నది. హరి నామంతో ధనుర్మాసం 30 రోజులు ప్రతి వీధిలో కఠినదీక్షతో హరిదాసులు వీధిలో జైశ్రీరామ్, జై శ్రీమన్నారాయణ నామ జపంతో వీధుల్లో ప్రజలను కలవడం జరుగుతుంది భక్తులు తమకు తోచిన దనరూపాన, ధాన్య రూపానా మనము సహకరించాలి తప్ప వాళ్ళు మనలని కోరరు అని కనుమరుగవుతున్న హరిదాసు యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు భక్తులకు తెలియపరచడమే ప్రధాన ఉద్దేశం గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆడారి కుమారస్వామి తెలిపిరి. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ పెద్దలు . ఆళ్ల.సూర్య రామకృష్ణ పలకా.రాము ,బొబ్బిలి అప్పారావు,. పిట్ల బుడ్డీశ్వరరావు విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు డి.డి నాయుడు. తదితర వక్తలు హిందూ సాంప్రదాయాలు సంస్కృతి హరిదాసు యొక్క ప్రాముఖ్యత పై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పలకా. సత్యనారాయణ బొట్టా. చిన్ని యాదవ్ ,దాడి జగన్ పసుపులేటి అప్పారావు బొబ్బిలి సురేష్ ఆళ్ళ సంతోష్, కుండల రామకృష్ణ బొట్టా ఆదినారాయణ బొడ్డేడ ఈశ్వర్ ,దాడి ఆది గణేష్, ముగడ అప్పారావు, ఆడారి. జగ్గారావు యల్లపు. శివాజీ, విజయ వినాయక ఆలయం ప్రధాన అర్చకులు సంగమేశ్వర రావు మరియు ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొనిరి.//


