జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 13 పల్నాడు జిల్లా ఇన్చార్జ్ సలికినీడి నాగు
చిలకలూరిపేట:పట్టణంలోని పేద ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక అన్న క్యాంటీన్‌ను సందర్శించి,క్షుణ్ణంగా పరిశీలించారు.తనిఖీలో భాగంగా కమిషనర్ తనిఖీ చేశారు. వడ్డిస్తున్న ఆహార పదార్థాల రుచిని, నాణ్యతను పరీక్షించారు. చేయడానికి వచ్చిన అక్కడ ఉన్న వారితో మాట్లాడి, అనంతరం ఆయన మాట్లాడుతూ క్యాంటీన్ పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలనికమిషనర్తో పాటు విచ్చేసిన ఇంచార్జ్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ ఖాదర్ క్యాంటీన్ వద్ద పారిశుధ్య నిర్వహణను పర్యవేక్షించారు. వ్యర్థాల నిర్వహణ సక్రమంగా ఉండాలని, ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, అన్న క్యాంటీన్ నిర్వాహకులు పాల్గొన్నారు.


