Listen to this article

జనం న్యూస్- జనవరి 14- నాగార్జునసాగర్ టౌన్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీకి చెందిన నెట్ బాల్ నేషనల్ క్రీడాకారుడు ఎస్.కె నాగూర్ భాష (21) గత సంవత్సరం జనవరి 14వ తారీఖున హత్యకు గురైన విషయం విధితమే, హత్య కు గురై సంవత్సరం గడుస్తున్న దోషులకు ఇంతవరకు శిక్ష పడకుండా తమ కళ్ళముందే తిరుగుతున్నారని మృతుని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆవేదనకు గురవుతున్నారు. ఈరోజు ఉదయం హిల్ కాలనీ మెయిన్ బజార్ లో ముస్లిం మైనారిటీ సభ్యులు, అఖిలపక్షం ఆధ్వర్యంలో నాగూర్ భాషకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, నిందితులు ఎంతటి వారైనా విడవకుండా కఠిన శిక్ష విధించాలని అప్పుడే నాగూర్ భాష ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. నాగుర్ భాష కుటుంబ సభ్యులు మాట్లాడుతూ దోషులు ఎంతటి వారైనా శిక్ష పడే వరకు విడిచి పెట్టేది లేదని తమ న్యాయ పోరాటం కొనసాగుతుందని చేతికి అంది వచ్చిన కొడుకుని పోగొట్టుకుని తల్లడిల్లుతున్న తల్లి ఆవేదన మరొక కుటుంబానికి కలగకుండా దోషులకు కఠిన శిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. తమకు కష్ట కాలంలో వెన్నంటి ఉన్న ముస్లిం మైనార్టీ సభ్యులకు, నాగూర్ భాషా స్నేహితులకు, అఖిలపక్ష నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తమ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సభ్యులు రఫీ అస్గర్ సమీర్ షరీఫ్ షబ్బీర్ నజీర్ గాని జానీ మస్తాన్ రఫీ (హ్యూమన్ రైట్స్ ), మాజీ బి ఆర్ ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రమేష్ జి, చంద్రమౌళి, మూడో వార్డు మాజీ కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్, టిఆర్ఎస్ పార్టీ మైనారిటీ జిల్లా నాయకులు మక్సుద్, నకరికంటి సైదులు బిజెపి ఎస్సీ మోర్చా నాయకులు రాందాస్, నాగూర్ భాష స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.