

అక్రమ నిర్మాణాలను తొలగించాలని సిపిఎం పార్టీగా డిమాండ్
జనం న్యూస్ పీబ్రేవరి 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న ప్రధాన నాలా (వాగు )55 ఫీట్లు ఉన్న కూడా ఆ నాలా చుట్టుపక్కల ఉన్నవారు కబ్జాలు చేసి ఇండ్ల నిర్మాణం చేపట్టారు. మరి కొంతమంది కబ్జా చేసిన స్థలాన్ని మున్సిపల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని అమ్ముకున్నారు. అదేవిధంగా ఒక ప్రైవేట్ స్కూలు నాలాలోనే అండర్ గ్రౌండ్ లో నిర్మాణం చేపట్టారు. చిన్నపాటి ప్రమాదం జరిగితే అందులో ఉన్న పిల్లలు ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడరు. అదేవిధంగా ఒక ప్రైవేట్ కాలేజీ కూడా అలాగే ఉంది. కావున నాగశ్రీ లాడ్జి నుండి రైల్వే ట్రాక్ వరకు అక్రమ నిర్మాణాలను తొలగించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. మరి నాళాలు ఎలా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ప్రభుత్వ భూములు ఎలా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అనే విషయం ప్రశ్నార్థకంగా మారుతుంది. దీనికి ప్రధానంగా పాలకులు, అధికారులు కారణమని సిపిఎం పార్టీ భావిస్తుంది. 55 ఫీట్లు ఉన్న నాలా 10 నుండి 15 ఫీట్లు మాత్రమే ఇప్పుడు ఉంది. ఈ ప్రధాన నాలా ఏదైతే ఉందో గుట్టల నుండి ఊరి మధ్యలో నుండి పెద్ద ఎత్తున వర్షాకాలం పార్తుంది .ఇలా కబ్జాలు చేయడంతో వర్షపు నీరుతో కాగజ్‌నగర్ పట్టణం మునిగే అవకాశాలు ఉన్నాయి.కావున అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని ఈ నాలాల చుట్టూ ఉన్న ప్రధాన వ్యక్తుల ఇండ్లు తొలగించాలని రాబోయే రోజులలో వర్షపు నీటి నుండి కాపాడాలని కోరుతున్నాము.