Listen to this article

జుక్కల్ జనవరి 14 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలం పెద్ద ఏడిగీ గ్రామంలో మంగళవారం నాడు ఎస్సై నవీన్ చంద్ర ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దునాలుగు చక్రాల వాహనంలో ప్రయాణించేటప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించడం
మద్యం సేవించి వాహనం నడపవద్దంటూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని
చిన్న పొరపాటు వల్ల మన నిండు ప్రాణాలు పోతాయని తెలియజేసినారు సురక్షత ప్రయాణం చేసి గమ్యం చేరాలని ఒక్కసారి ఆక్సిడెంట్ జరిగితే మన కుటుంబం పెద్దదిక్కును కోల్పోతుందని రోడ్డు ప్రమాదాలు తగ్గించి మనం అందరికి ఆదర్శంగా నిలవాలని గ్రామవాసులు అందరికీ కూడా ఎస్సై నవీన్ చంద్ర చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు జుక్కల పోలీస్ హెడ్ కానిస్టేబుల్. శ్రీనివాస్ పిసి. హరిష్, లింగ్గురం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు