Listen to this article

జనం న్యూస్ జనవరి 14: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామసర్పంచ్ ప్రవీణ్ యాదవ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు, యువతులకు బహుమతులను ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్, స్థానిక ఉపసర్పంచ్ మూడ్ దయానంద్, మహిళా కానిస్టేబుల్ శ్రావణి చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఎస్సై పడాల రాజేశ్వర్ మాట్లాడుతూ, మహిళల ప్రతిభను వెలికితీసేలా ముగ్గుల పోటీలు నిర్వహించడం ఎంతోఆనందదాయకమని, ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ సంప్రదాయాలను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు కుందేన లక్ష్మి, మహిళా సంఘాల వివోఏలు లక్ష్మి, లావణ్య, స్థానిక వార్డు మెంబర్ సారంగి ముత్తెమ్మ, స్థానిక యువకులు గోరె మియా, కట్కామ్ శమంత్ రెడ్డి, చరణ్, రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.