జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని మండల కేంద్రంలో రైతు వేదిక లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎన్నికైన కమిటీ సభ్యులు:అధ్యక్షులు: పరకాల రఘు ఉపాధ్యక్షులు: ఆరికిల్ల దేవయ్య
ప్రధాన కార్యదర్శి: బంక రమేష్ కోశాధికారి: గుడెపు వేమేందర్ కార్యవర్గ సభ్యులు: పరికి రమేష్, కుక్కల రమేష్, బాసాని శ్రీహరి కమిటీ సభ్యులు: మారపల్లి సుధాకర్, చెన్నబోయిన సారంగపాణి, గుడెపు హరికృష్ణ
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్, పరకాల వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ మారపెల్లి (బుజ్జిన్న) రవీందర్ హాజరు కాగా అనంతరం నూతన అధ్యక్షుడు పరకాల రఘు మాట్లాడుతూ… అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్‌ను నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. చాలా మంది చిన్న వయస్సులోనే బీపీ, షుగర్, థైరాయిడ్ బారిన పడుతున్నారని, కాబట్టి ప్రతిరోజు ఉదయం వాకింగ్ తప్పనిసరిగా చేయాలని తెలియజేశారు….


