Listen to this article

భోగాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చమర్తి జగన్ మోహన్ రాజు ;

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నందలూరుమండలం,కుంపిణీ పురం గ్రామంలో జరుగుతున్న శ్రీశ్రీశ్రీ భోగాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరై ఆంజనేయ స్వామి ని దర్శించుకుని చమర్తి జగన్ మోహన్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు నిర్వహించిన రథోత్సవాన్ని బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తో కలిసి పూజలు నిర్వహించి కొద్దిసేపు భక్తులతో కలిసి రథాన్ని లాగారు. వేద పండితులు వేదమంత్రాలతో స్వామివారి శాలువా వేసి పూల మాలలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసిఆశీర్వదించారు.అంతకుముందు గ్రామంలో పర్యటించిన ఆయనకు గ్రామస్తులు బాండ్ వాయిద్యాల మధ్య పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జంగం శెట్టి సుబ్బయ్య,మండల క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్,టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, పార్లమెంట్ అధికార ప్రతినిధి అమ్మినేని అజయ్ కుమార్, చింతకాయలపల్లి సర్పంచ్ చుక్కా యానాది,జెసిబి భాస్కర్,గణపతి సుధాకర్,పోత్తపి భాస్కర్,విట్లాచారి స్వామి,తుంటి ఆంజనేయులు,గోపాల్ రాజు, పూలపత్తూరు మల్లికార్జున రాజు,గంగనపల్లి శ్రీనువాసులు,మీసాల శ్రీను,నువ్వుల శివయ్య,ఆర్.సతీష్ రాజు,తేజాల ఆనంద్,జగదాభి పాండురాజు,పరశురాం నాయుడు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.