జనం న్యూస్ 15జనవరి పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం పరిధిలో అయితుపల్లి గ్రామంలో శ్రీ రామాలయంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం రోజున ఉదయం 7 గంటలకు తిరుప్పావై సేవ 10:30 కు విశ్వక్సేన ఆరాధన వాసుదేవ పుణ్యాహవాచనం రక్షాబంధనం పురస్కరించుకొని అనంతరం శుభ ముహూర్తం ఉదయం గంటలు 11:30 నిమిషాలకు శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం రంగ రంగ వైభవంగా ఆలయ ప్రధాన అర్చకులు గోవిందుల కేదర స్వామి , లక్ష్మణాచారి ఆధ్వర్యంలో జరిగినది. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్స్, గ్రామస్తులు, గ్రామ పెద్దలు భక్తులు, చిన్నల పెద్దలుఅధిక సంఖ్యలో పాల్గొనున్నారు.


