శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలి…
బిచ్కుంద జనవరి 16 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మండల ఎస్సైగా రాజు బాధ్యతలు స్వీకరించినారు. బదిలీల భాగంగా మద్నూర్ నుండి బిచ్కుంద కు వచ్చినట్లుగా తెలిపారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని సూచించారు. పేకాట,అక్రమ ఇసుక మాఫియా పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


