Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ సలికినీడి నాగు

ఈ రోజు (16/01/26) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారం తో పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమరు గ్రామం సచివాలయం నందు సక్రాంతి పండుగ ను పురస్కరించుకొని చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీమ్ ప్రాజెక్ట్ వారు దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు పసుమర్రు గ్రామ స్థానిక తెలుగు దేశం పార్టీ ప్రెసిడెంట్ కొడవలి శ్రీనివాసరావు ఆర్థిక సహాయం తో పౌష్టిక ఆహారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు బంగారు బాబు , శరత్, పున్నయ్య చౌదరి, యం శ్రీను , నాగూర్ వలి మరియు పంచాయతీ సెక్రటరీ కె కవిత పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐ సి టి సి కౌన్సిలర్ యం హనుమంతరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా మందులు వాడుతూ మంచి పౌష్టికాహారమును తీసుకోవటం వలన ఎక్కువ కాలం జీవించ గలరు అని చూపించారు ఈ కార్యక్రమంలో డి ఆర్ పి వాసుదేవరావు, జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు, క్లస్టర్ లింక్ వర్కర్ యం మెర్సీ ఫ్లారెన్స్ పాల్గొని నిర్వహించారు.