జనం న్యూస్ ; 16 జనవరి శుక్రవారం;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
సిద్దిపేట పట్టణంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌కు ఎన్నో సంవత్సరాల తరువాత కొత్త కళ వచ్చింది. కాలేజీ భవనానికి ప్రస్తుతం రంగులు వేయడం ప్రారంభించడంతో క్యాంపస్ మొత్తం నూతన శోభతో మెరిసిపోతోంది.ఈ రంగుల పనులను రీజినల్ కోఆర్డినేటర్ డా. ఎం. శ్రద్ధానందం పర్యవేక్షణలో చేపట్టారు. త్వరలో నిర్వహించనున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా కళాశాల మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.డా. శ్రద్ధానందం మాట్లాడుతూ, “పూర్వ విద్యార్థులు తిరిగి తమ కాలేజీకి వచ్చి ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో క్యాంపస్‌ను అందంగా తీర్చిదిద్దుతున్నాం. ఇది విద్యార్థుల్లో ప్రేరణను పెంచుతుంది” అని అన్నారు.
చాలా కాలంగా పెయింటింగ్ లేకుండా ఉన్న భవనానికి ఇప్పుడు కొత్త రంగులు రావడంతో విద్యార్థులు, కౌన్సిలర్లు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా వివిధ కార్యక్రమాలు, అనుభవాల పంచుకోవడం, సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


