Listen to this article

జనం న్యూస్ // ఫిబ్రవరి 6// జమ్మికుంట// కుమార్ యాదవ్..గత పాతికేళ్ల క్రితం చిరుతల రామాయణం అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎంతో క్రేజీ ఉండేది. అలాంటి చిరుతల రామాయణం గ్రామీణ ప్రజలకు అలవోకగా నేర్పి ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీపాద చంద్రయ్య చిరుతల రామాయణం గురువు గుండెపోటుతో రెండు రోజుల క్రితం ఆకస్మికంగా మృతి చెందారు. ఆ విషయం తెలియగానే చిరుతల రామాయణం నేర్చుకున్న అతనికి శిష్యులు అతని అభిమానులు ఆయన అంత్యక్రియలో పాల్గొనడం కాక ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలిపారు. చంద్రయ్య చిరుతల రామాయణాన్ని కళ్ళకు కట్టినట్టుగా నాటి రామాయణాన్ని ప్రజలకు ప్రదర్శించి భక్తి పారవశ్యంలో మునిగి పోయేలా చేసేవారు అనడంలో అతిశయోక్తి లేదు. ఆయన పౌరాణిక నాటక కళారంగాన్ని అతని వారసత్వంగా పెద్ద కుమారుడైన రమేష్ కలలను నేర్చుకున్నాడు. అంతేగాక డోలక్ వాయించడంలో ఎంతో నేర్పరి. ఆయన అనేకచోట్ల భజన పోటీలకు వెళ్లి తన డెవలప్ విన్యాసాన్ని ప్రదర్శించి జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో బహుమతులు అందుకున్నారు. రమేష్ తండ్రి చంద్రయ్య మృతి చెందడన్న విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు మేకల తిరుపతి, బిజెపి సీనియర్ నాయకుడు మోతి తిరుపతి, సీనియర్ జర్నలిస్టు మండల యాదగిరి, ఆ గ్రామం మాజీ సర్పంచ్ లు, వివిధ పార్టీల నాయకులు, సీనియర్ కళాకారులు, జర్నలిస్టులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.