Listen to this article

జనం న్యూస్‌ 16 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

తెలుగు ప్రజలు గర్వపడే ప్రముఖ పారిశ్రామిక వేత్త, జీ ఎం ఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జున రావును ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) గురువారం రాజాంలోని జీఎంఆర్ ఐటీ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అల్లుడు నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మతో కలిసి వెళ్ళిన చిన్న శ్రీను, జీ ఎం ఆర్ కు దుశ్శాలువ కప్పి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరువురు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు.