లేకుంటే మేమే నిర్ణయం తీసుకుంటాం
అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 16 జనవరి
ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫిరా యింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ల పై 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశిం చింది. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇప్పటి వరకు స్పీకర్ ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీసుకున్న చర్యలను న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు నివేదిం చారు. దీంతో మిగతా వారిపై 2 వారాల్లో నిర్ణ యం తీసుకోవాలని ఆదేశించగా ఇందుకు అభి షేక్ సింఘ్వీ గడువు కోరారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు 4 వారా ల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని, ఇదే ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసు కోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం ఆగ్రహం చేసింది. రెండు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హత వేటుపై స్పీకర్ తీసుకున్న చ ర్యల అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. కాగా, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాగా వారిలో అరికపూడి గాంధీ, గూడెం మహిపా ల్రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్డ్డి, కాలే యద య్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో దానం నాగేం దర్ విషయంలో స్పీకర్ వేటు తప్పపదనే టాక్ వినిపిస్తోంది. మరో ఇద్దరు కడియం శ్రీహరి, సంజయ్కుమార్లపై గడ్డం ప్రసాద్ కుమార్ ఎ లాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


