

జనం న్యూస్ 6 ఫిబ్రవరి భీమారం మండలం ప్రతినిధి (కాజీపేట రవి ) =భీమారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కాలనీ కి చెందిన రాంటెంకి రంజిత్ కుమార్ s/o లచయ్య ఇంట్లో ఎవరు లేని సమయం లో ఇంటి తలం పగులగొట్టి బీరువాలో దాచుకున్న 50000 రూపాయలు మరియు 42000 రూపాయలు విలువగల బంగారం దొంగలించుకొని పోయినారు. తేది 31-01-2025 నాడు తన కొడుకు అక్షరాభ్యాసం కోసం సిద్ధిపేట శనిగరం గ్రామం సరస్వతి గుడికి వెళ్లారు-o5 -o2 -2025 రోజున తిరిగి వచ్చేసరికి సంఘటన జరిగింది .ఇట్టి విషయం పై భీమర పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు భీమారం మండల ఎస్ ఐ కే శ్వేత తెలిపారు