Listen to this article

జనం న్యూస్ జనవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంచారు. పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ వి.విష్ణు స్వరూప్ పర్యవేక్షణలో, అచ్యుతాపురం మరియు పరవాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో:​అచ్యుతాపురం ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ మరియు వారి సిబ్బంది జరిపిన దాడుల్లో మొత్తం 4 కేసులు నమోదయ్యాయి: కోడి పందాలు: రెండు వేర్వేరు ప్రాంతాల్లో (Cr.no -14/26, 15/26) దాడులు నిర్వహించి, నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 4 పందెం కోళ్లు మరియు రూ. 2,950/- నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం (Dice Game):* మరో రెండు కేసుల్లో (Cr.no- 16/26, 17/26) జూదం ఆడుతున్న ఇద్దరిని పట్టుకుని, వారి వద్ద నుండి రూ. 2,600/- నగదును రికవరీ చేశారు.​2. పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో:​పరవాడ ఎస్.హెచ్.ఓ మల్లికార్జున రావు మరియు సిబ్బంది జరిపిన తనిఖీల్లో కోడి పందాలు మరియు అక్రమ మద్యంపై కేసులు నమోదు చేశారు: ​కోడి పందాలు: రెండు కేసుల్లో (Cr.no. 9/2026, 10/2026) నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4 పందెం కోళ్లు, 4 కత్తులు మరియు రూ. 2,450/- నగదు స్వాధీనం చేసుకున్నారు.​నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసి, 5 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ​పండుగ పూట చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. కోడి పందాలు, జూదం వంటి వాటికి దూరంగా ఉండి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి. నిరంతరం నిఘా కొనసాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.//