Listen to this article

జనంన్యూస్. 16.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

సిరికొండ నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఆర్.సి.రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సిరికొండ మండలానికి చెందిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధుల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా రాజ చందన్ రెడ్డి (ఆర్.సి. రెడ్డి), ఉపాధ్యక్షుడిగా ములుగు రాజేశ్వర్ (ఎంఆర్ఆర్), క్యాషియర్‌గా సయ్యద్ ఆసిఫ్,.కార్యదర్శిగా శ్రీనివాస్, సభ్యులుగా అవినాష్, మనీష్ న్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఆర్.సి. రెడ్డి మాట్లాడుతూ—ఈ అవకాశం కల్పించిన పాత్రికేయ మిత్రులు రాజేశ్వర్, శ్రీనివాస్, ఆసిఫ్, మనీష్, అవినాష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యత ఒక్కరిదే కాదని, మనందరి సమిష్టి బాధ్యత అని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఏ సమస్య ఉన్నా ముందుండి పరిష్కరించేలా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.అలాగే మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు–ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేలా అందరి సమన్వయంతో ముందుకు సాగుతామని తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలను తెలియజేయాలని, వాటిని వార్త రూపంలో త్వరితగతిన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజ చందన్ రెడ్డి (ఆర్.సి. రెడ్డి), ఉపాధ్యక్షుడు ములుగు రాజేశ్వర్, క్యాషియర్ ఆసిఫ్, కార్యదర్శి శ్రీనివాస్, సభ్యులు మనీష్, అవినాష్ పాల్గొన్నారు.