జనం న్యూస్ఏర్గట్ల16: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండల కేంద్రంలో శుక్రవారం ఏర్గట్ల మండల అంబేద్కర్ యువజన కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్ రక్షక్, బీసీ–ఎస్సీ–ఎస్టీ జిల్లా అధ్యక్షుడు కోటగిరి రామ గౌడ్, బీఎంఎం జిల్లా అధ్యక్షుడు దిబ్బ సుదర్శన్, డివిజన్ నాయకులు పడిగేలా శోభన్, గన్నరపు రాజేశ్వర్, నిరడి సురేష్ పాల్గొన్నారు.కమిటీ నూతన అధ్యక్షులుగా సిహెచ్ రాజు, ప్రధాన కార్యదర్శిగా సంగెపు ఆనంద్, ఉపాధ్యక్షులుగా జూంగల గణేష్ ముదిరాజ్, సయ్యద్ అజీమ్, కుండ సాయన్న (చక్రి), అచ్చ సునీల్, దిబ్బ దేవన్నలను ఎన్నుకున్నారు. జాయింట్ సెక్రటరీలుగా స్వాతి అనిల్, నరల ప్రేమ్, గౌరవ అధ్యక్షులుగా ముక్కెర గంగ భూమన్న యాదవ్, అంబటి రాజేశ్వర్, కోశాధికారులుగా భీమ గంగాధర్, దిబ్బసురేందర్‌లను నియమించారు. సలహాదారులుగా పౌలింగ్, నరల భూమేశ్వర్, ఆర్గనైజేషన్ సెక్రటరీగా జంగం ముత్తేన్న, సాంస్కృతిక కమిటీ అధ్యక్షుడిగా మాలవత్ జగన్ నాయక్, వర్కింగ్అధ్యక్షులుగా దయానంద్, ఎట్టెం అరుణ్ యాదవ్‌లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన నాగేంద్ర నగర్ సర్పంచ్ సందే రంజిత్, బట్టాపూర్ ఉపసర్పంచ్ మూడ్ దయానంద్, ఏర్గట్ల వార్డు సభ్యులు ఎట్టెం అరుణ్ యాదవ్, గన్నరపు రాజేశ్వర్, ఆనంద్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గద్దల సతీష్, మాధరి రాజేష్, శ్రీవర్ధన్, గజేందర్ నాయక్, సురేష్, న్యాత రవి, రాము తదితరులు పాల్గొన్నారు



