జనం న్యూస్ జనవరి 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం వాట్సాప్ గ్రూపులలో నాకు రూ. 5 వేలు వచ్చాయి.నేను నకిలీ అనుకున్నాను.మీరు ప్రయత్నించి చూడండి మీరు పది మందికి ఫార్వర్డ్ చేయండి అనీ వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని శాయంపేట మండల స్థానిక ఎస్సై జక్కుల పరమేశ్వర్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ… సైబర్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలని, సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.వాట్సాప్, ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ తదితర మాధ్యమాల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు….


