Listen to this article

జనంన్యూస్. 16.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

నిజమాబాద్ జిల్లాలో రాబోయే వేసవి కాలంలో తాగు నీటి సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ అంకిత్ మిషన్ భగీరథ మరియు పంచయతిరాజ్ డిపార్ట్మెంట్ లతో సమావేసం తీసుకున్నారు. వచ్చే ఫిభ్రవరి 1వ తేదీ లోపు అన్ని గ్రామాలలో మంచినీటి మరియు పారిశుద్ద్య కమిటీలను ఏర్పాటు చెసుకుని నీటి సరఫర తీరు నిశితంగా పరిశీలించాలని, ఫిభ్రవరి 1 నుండి 20 వ తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ జరిపించడానికి ఆదేశాలు జారీ చేస్తూ అన్ని మండల ఎం.పీ.ఓ మరియు మిషన్ భగీరథ ఏ.ఈ లు మండల స్థాయి బృందాలుగా ఏర్పడి మండలంలోని అన్ని గ్రామాలలో సర్పంచ్ మరియు సెక్రటరీలతో కలసి అన్ని వీదులలో పర్యటించి గ్రామంలో నీటి సమస్యలను గుర్తించి మరియు కార్యాచరణ ప్రణాలిక సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్రామాలలో నీటి సమస్యలు ఎదురైతే రాష్ట్ర స్థాయి టోల్ ఫ్రీ నెం. 1916 కు కాల్ చేసి అధికారుల ద్రుష్టికి తీసుకురావాలని తెలియచేసారు. ఈ సమావెశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, మిషన్ భగీరథ ఎస్.ఈ రాజేందర్, ఈ.ఈ లు రాకేష్, నరేష్ , స్వప్న, DLPOs, DEEs, అన్ని మండలాల MPDOs, MPOs మరియు AEEs పాల్గొన్నారు