జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.
వాట్సాప్ గ్రూపుల్లో రూ.5 వేలు వస్తాయని లింక్స్ షేర్ చేయమని వస్తున్న మెసేజ్ లను నమ్మవద్దని నందలూరు ఎస్సై మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవద్దని,ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింక్ లను తెరవకుండా, ఇతరులకు కూడా పంపకుండా ఉండాలని సూచించారు. ఇలాంటి ఫేక్ లింక్స్ చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు.


